Nandyala: చౌడేశ్వరీ దేవి ఆలయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు!

Nandyala: బనగానపల్లి మండలం నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారిని నంద్యాల ఎంపీ, టీడీపీ లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి దర్శించుకున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Updated on: 9 July 2026 12:53 PM IST
Nandyala
X

Nandyala: చౌడేశ్వరీ దేవి ఆలయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు!

నంద్యాల : బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో వెలసిన శ్రీచౌడేశ్వరీదేవి అమ్మవారికి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, టీడీపీ లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం ప్రత్యేక పూజలు చేశారు.

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ ఈ ఓ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి. వి. నాగార్జునరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి వి కుమార్ రెడ్డిలు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధక్షిణ అనంతరం శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారికి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అర్చన, అభిషేకం, శ్రీ చక్రంకు కుంకుమార్చన తదితర విశేష పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి తీర్థ ప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సన్మానం చేసి ఆశీర్వదించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story