Nandyala: RGM కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు

Nandyala: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆర్‌జీఎం (RGM) ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని నెరవాడ మెట్ట కల్వర్టుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

R Pavankalyan, Nandyal
Published on: 8 July 2026 10:57 AM IST
Nandyala
X

Nandyala: RGM కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు

Nandyala: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని RGM ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని నెరవాడ మెట్ట కల్వర్టుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు వైపు నుంచి కడప వైపు వెళ్తున్న కారు, ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపుతప్పి లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులకు సహాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది ..అనంతరం పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సురక్షిత దూరం పాటిస్తూ, అతివేగం లేకుండా అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story