Nandyala: బిగ్ బాస్-10 లోకి పోలీస్ అధికారి? నంద్యాల ఎస్సై వీడియో వైరల్!

Nandyala: బిగ్ బాస్-10 లో పాల్గొనేందుకు నంద్యాల జిల్లా గడివేముల ఎస్సై నాగార్జున ఆసక్తి చూపారు. ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

R Pavankalyan, Nandyal
Published on: 24 Jun 2026 4:56 PM IST
Nandyala
X

Nandyala: బిగ్ బాస్-10 లోకి పోలీస్ అధికారి? నంద్యాల ఎస్సై వీడియో వైరల్!

నంద్యాల జిల్లా: బిగ్ బాస్… ఈ పేరు వినగానే గుర్తొచ్చేది సెలబ్రిటీలు, ఎంటర్‌టైన్‌మెంట్, టాస్కులు, డ్రామా. కానీ ఈసారి బిగ్ బాస్-10లో ఓ పోలీస్ అధికారి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ 10 తెలుగు కోసం నంద్యాల జిల్లా గడివేముల మండలానికి లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున తన ఆసక్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. తాను కూడా బిగ్ బాస్ వేదికపై తనను నిరూపించుకోవాలని చెబుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గడివేముల లో ప్రస్తుతం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున… తన క్రమశిక్షణ, డ్యూటీ పట్ల అంకితభావంతో ఇప్పటికే స్థానికంగా మంచి గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు పోలీస్ యూనిఫామ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో కూడా తన ప్రతిభ చూపించాలని ముందుకు వచ్చారు.

ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఎస్సై నాగార్జున… బిగ్ బాస్ షోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు సెలబ్రిటీలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తూ కొత్త ప్రతిభను వెలికితీస్తున్న బిగ్ బాస్ టీమ్‌ను ఆయన అభినందించారు.

“ఒక అవకాశం ఇస్తే… నేను నన్ను నిరూపించుకుంటాను” అంటూ ఎస్సై నాగార్జున ధైర్యంగా ప్రకటించారు.

పోలీస్ ఉద్యోగం అంటే కఠిన క్రమశిక్షణ, ఒత్తిడి, ప్రజల సమస్యల పరిష్కారం. అలాంటి బాధ్యతల మధ్య కూడా తనలోని మరో కోణాన్ని ప్రపంచానికి చూపించాలనే ఆసక్తితో నాగార్జున ముందుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్‌లో అవసరమైన లీడర్‌షిప్, మెంటల్ స్ట్రెంగ్త్, పేషెన్స్ వంటి లక్షణాలు తనలో ఉన్నాయని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన వీడియోకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు “ఒక పోలీస్ అధికారి బిగ్ బాస్‌లో ఉంటే కొత్త అనుభవం అవుతుంది” అంటుండగా… మరికొందరు “యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి ఎంటర్‌టైన్‌మెంట్ షోలో ఎలా రాణిస్తారు?” అనే ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సై నాగార్జున స్వస్థలం కడప జిల్లా. సాధారణ కుటుంబం నుంచి వచ్చి పోలీస్ అధికారిగా ఎదిగిన ఆయన… ఇప్పుడు మరో పెద్ద వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

ఇప్పటివరకు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కామన్ పీపుల్‌కు మాత్రమే ఎక్కువ అవకాశాలు కనిపించిన బిగ్ బాస్… ఈసారి ఓ పోలీస్ అధికారికి ఛాన్స్ ఇస్తుందా? ఎస్సై నాగార్జున బిగ్ బాస్-10 హౌస్‌లో అడుగుపెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి బిగ్ బాస్ టీమ్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story