Nandyala: నంద్యాలలో చోరీ యత్నం.. సీసీ కెమెరాకు చిక్కిన ఐదుగురు దొంగలు!
Nandyala: నంద్యాల సమీపంలోని శ్రీ సాయి నగర్ వెంచర్‌లో ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు తెల్లవారుజామున హల్‌చల్ చేశారు.
Nandyala: నంద్యాలలో చోరీ యత్నం.. సీసీ కెమెరాకు చిక్కిన ఐదుగురు దొంగలు!
Nandyala: నంద్యాల సమీపంలోని రైతు నగరం శ్రీ సాయి నగర్ వెంచర్‌లో చోరీ యత్నం కలకలం రేపింది. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, ముసుగులు ధరించిన ఐదుగురు దొంగలు మెయిన్ గేట్ ద్వారా కాలనీలోకి ప్రవేశించిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
సీసీ ఫుటేజ్ ప్రకారం, దొంగలు కాలనీలో కొంతసేపు సంచరిస్తూ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఇదే వీధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని, ఇంటి ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
ఇంట్లోకి వెళ్లిన దొంగలు అల్మారాలు, గదులను పూర్తిగా గాలించారు. అల్మారాల్లో ఉన్న బట్టలను కింద పడేసి విలువైన వస్తువుల కోసం వెతికినట్లు తెలుస్తోంది. అయితే, దొంగలకు విలువైన వస్తువులు ఏవీ దొరకకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.
దాదాపు అరగంట పాటు ఐదుగురు దొంగలు కాలనీలో సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా వెల్లడైంది. ఈ ఘటనతో కాలనీవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీ ప్రతినిధులు సూచించారు ఏ ఎస్ పి జావలి. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.




