Kurnool: సర్దార్ పటేల్ స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడాలి!
Kurnool: కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.
Kurnool: సర్దార్ పటేల్ స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడాలి!
Kurnool: బి. క్యాంప్‌లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జాతీయ సమైక్యతా భావంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
అలాగే భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, పరిపాలన మరియు జాతీయ సమైక్యత కోసం ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు దేశ చరిత్రను, నాయకుల జీవితాలను తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రిన్సిపాల్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, ఉల్గోజి రావు, శారధి పటేల్, ఇంతియాజ్, జబీన్ అక్తర్, గిరిజ, లక్ష్మి, సాయి స్రావణి, లావణ్య మరియు విద్యార్థులు పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు.




