Kurnool: ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన సునీత బాయి!
Kurnool: కర్నూలు జిల్లా గూడూరులో కూటమి అభ్యర్థి డమాం సునీత బాయి ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ హామీలు ఇచ్చారు.
Kurnool: ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన సునీత బాయి!
Kurnool: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో కూటమి అభ్యర్థి డమాం సునీత బాయి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వారి ప్రధాన సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న డమాం సునీత బాయి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను కలుస్తున్నారు.




