Markapuram: "ప్రజలు ఆందోళన వద్దు" ఇంధన తనిఖీల్లో మార్కాపురం సీఐ

Markapuram: మార్కాపురంలో పెట్రోల్ బంకులపై సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆకస్మిక తనిఖీలు. ఇంధన కొరత పుకార్లను నమ్మవద్దని హెచ్చరిక.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 April 2026 2:04 PM IST
Markapuram
X

Markapuram: "ప్రజలు ఆందోళన వద్దు" ఇంధన తనిఖీల్లో మార్కాపురం సీఐ

మార్కాపురం జిల్లా: కేంద్రంలోని పలు పెట్రోల్ బంకులను మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంధనం కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అక్రమాలు, నిల్వల దుర్వినియోగం వంటి చర్యలు చేపట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story