Nandyal: చలో విజయవాడకు అనుమతి లేదు: నంద్యాల ఎస్పీ సునీల్
Nandyal: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల "చలో విజయవాడ" ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని, పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని నంద్యాల ఎస్పీ సునీల్ హెచ్చరించారు.
Nandyal: చలో విజయవాడకు అనుమతి లేదు: నంద్యాల ఎస్పీ సునీల్
నంద్యాల జిల్లా: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పిలుపునిచ్చిన "చలో విజయవాడ" కార్యక్రమంపై నంద్యాల జిల్లా పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. విజయవాడలో చేపట్టనున్న ధర్నాకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ సునీల్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు "చలో విజయవాడ" పేరుతో ధర్నాకు పిలుపునిచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ తెలిపారు. అయితే ఆ కార్యక్రమానికి ఎలాంటి పోలీసు అనుమతులు లేవని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు అనుమతి లేని ధర్నాల్లో పాల్గొనడం ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఉద్యోగులెవరూ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.
"అనుమతి లేకుండా విజయవాడకు వెళ్లే వారిని డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తాం. చట్టప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా, సంబంధిత సర్వీస్ రూల్స్ ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం... అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ మరోసారి విజ్ఞప్తి చేశారు.




