Kurnool: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
Kurnool: ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా కూలీ ఏకు సంధ్య (32) వడదెబ్బతో మృతి.. ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
Kurnool: వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
కర్నూలు: వంగూరు మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో వడదెబ్బ కారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఏకు సంధ్య (32) శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్లగా, మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండల కారణంగా ఆమె వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనైంది.గమనించిన తోటి కూలీలు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు గ్రామంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.మృతురాలికి భర్త, ఒక కుమారుడు ఉన్నారు. సంధ్య మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందజేయాలని గ్రామస్తులు కోరారు.




