సంచలనం: పెద్దపులుల వేటగాళ్లకు జైలు శిక్ష ఖరారు.. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు!

నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యం (NSTR) పరిధిలో రెండు పెద్దపులులను వేటాడి చంపిన కేసులో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి వేటగాళ్లకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 10 Jun 2026 4:48 PM IST
సంచలనం: పెద్దపులుల వేటగాళ్లకు జైలు శిక్ష ఖరారు.. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు!
X

సంచలనం: పెద్దపులుల వేటగాళ్లకు జైలు శిక్ష ఖరారు.. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు!

ఆత్మకూరు (నంద్యాల జిల్లా): ఉత్తర భారత దేశంలో పెద్దపులులను వేటాడే అంతర్జాతీయ ముఠాను మించి దక్షిణాదిలో అత్యంత క్రూరంగా జాతీయ జంతువు పెద్దపులులను వేటాడడంలో ఆ ముఠాకు తిరుగులేదు. అయితే అటవీ శాఖలోని కొందరు నిజాయితీ అధికారుల తెగువ, చట్టాలను కఠినంగా అమలు చేసి ప్రాణాలకు తెగించి పెద్ద పులుల వేటగాళ్ళకు ఎట్టకేలకు జైలు శిక్ష పడేలా వ్యవహరించిన విషయం భారతదేశంలోనే అతిపెద్ద పెద్ద పులుల అభయారణ్యం నాగార్జునసాగర్ - శ్రీశైలం అభయారణ్యంలో సంచలనం రేకెత్తించింది.

నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధి మాజీ నేరస్థుల పరివర్తన గ్రామం సిద్దాపురం సెటిల్మెంట్లో వేముల నాగేశ్వరరావు పెద్దపులులను, చిరుతలను అవలీలగా వేటాడడంలో తిరుగులేని జిమ్ కార్బెట్ లాంటి వేటగాడు. ఇతనికి అటవీ శాఖలో ఎందరో మిత్రులు ఉన్నారు. 2014లో ఎన్ ఎస్ టి ఆర్ మార్కాపురం డివిజన్ నల్లమలలో రెండు పెద్ద పులులను అతని సహాయకులుగా ఉన్న గంగు మాల విజయబాబు, అతని తండ్రి గంగు మాల చిట్టిబాబుతో కలసి తుపాకులతో 2 పెద్ద పులులను వేటాడి చంపారు. ఆ చర్మాలు, గోళ్లను పెద్ద దోర్నాల సమీపంలో అయిన ముక్కల గ్రామంలో ఓ ఇంటిలో దాచారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రంలోనే పెద్ద సంచలనం రేపింది. కేంద్ర ఎన్ టి సి ఏ తీవ్రంగా స్పందించి అంతర్జాతీయ స్మగ్లర్లకు పులి చర్మాలు, గోళ్లను విక్రయించే క్రమంలో ఈ ముగ్గురు పెద్దపుల వేటగాళ్లను దోర్నాలలో ఆత్మకూరు అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల తర్వాత 2020 లో మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు విచారణ జరిపి ముగ్గురు నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 50 వేల జరిమానా విధించింది.

అయితే.. నిందితులు జిల్లా కోర్టుకు ఆపిల్ చేసుకున్నారు. కానీ మరోసారి విచారణ అనంతరం ఐదేళ్ల తర్వాత మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తుది తీర్పును జిల్లా ఆరవ అదనపు జిల్లా సెషన్ న్యాయమూర్తి భవాని జైలు శిక్ష ఖరారు చేస్తూ తుదితీర్పించింది. దీంతో ముగ్గురు ముద్దాయిలను ఆత్మకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి తాహిర్ నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న గంగమాల చిట్టిబాబు, అతని కుమారుడు విజయ్ బాబు పలు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలతో పోలీసు రికార్డుల్లో ఎక్కారు. ఆత్మకూరు సమీప సిద్దాపురం సెటిల్మెంటులో తిష్ట వేసి పలు నేరాల్లో అరెస్టై రిమాండ్ కు కూడా వెళ్లారు . ఆత్మకూరు వన్యప్రాణి అడవి డివిజన్లో ప్రాణాలకు తెగించి అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆత్మకూరు వన్య ప్రాణి డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావో అభినందించారు. పెద్దపులుల వేటగాళ్లకు మార్కాపురం న్యాయస్థానం శిక్ష విధించడంతో ఆత్మకూరు ప్రాంతంలో వన్యప్రాణి వేటగాళ్ల ముఠాలు బెంబేలెత్తుతున్నాయి. రాజకీయ నాయకులను రహస్యంగా కలిసి వారిపై ఉన్న కేసుల తీవ్రతను తగ్గించాలని ద్వితీయ శ్రేణి నాయకులతో కాసుల ఒప్పంద మంతనాలు జరుగుతున్నాయని, రాబోయే రెండు విభాగాల ఎన్నికల్లో కీలక ప్రజా ప్రతినిధులకు ఏకపక్షంగా సహకరిస్తామనే సంప్రదింపుల సమాచారం నిఘా వర్గాలకు చేరిందని తెలుస్తుంది.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story