Kurnool: స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కమిషనర్!

Kurnool: కర్నూలులోని 125-128 స్వర్ణ వార్డు కార్యాలయాలను అదనపు కమిషనర్ ఎన్.వి. రమణారెడ్డి తనిఖీ చేసి, ఆధార్, ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Nov 2026 5:09 PM IST
Kurnool
X

Kurnool: స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కమిషనర్!

Kurnool: నగరంలోని 125, 126, 127, 128వ స్వర్ణ వార్డు కార్యాలయాలను అదనపు కమిషనర్ ఎన్.వి. రమణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. సిబ్బంది హాజరు పట్టికలు, సమయపాలనను పరిశీలించి విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, ఆన్‌లైన్‌ సేవల వేగం, పన్నుల వసూళ్ల ప్రగతిని సమీక్షించారు. కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆధార్‌ నవీకరణ, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు ఆధార్‌ లేని చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని రోజువారీ లక్ష్యాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్వర్ణ వార్డు సిబ్బందికి సూచించారు. అనంతరం ఎన్‌.ఆర్‌. పేటలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు తప్పనిసరి జీవముద్ర నవీకరణ, ప్రత్యేక ఆధార్‌ శిబిరాల ఏర్పాటుపై పాఠశాల యాజమాన్యంతో చర్చించారు. శిబిరాల నిర్వహణకు సిబ్బందికి పూర్తి సహకారం అందించి, విద్యార్థుల పెండింగ్‌ జీవముద్ర నవీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL