Nandyal: బొలెరోను ఢీకొట్టిన జేసీబీ.. నంద్యాల జిల్లాలో విషాదం

Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళంపల్లె వద్ద బొలెరో మరియు జేసీబీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించారు.

Bharat Raj, Dhone
Published on: 12 May 2026 9:23 PM IST
Nandyal
X

Nandyal: బొలెరోను ఢీకొట్టిన జేసీబీ.. నంద్యాల జిల్లాలో విషాదం

Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళంపల్లె చెరువు సమీపంలో బొలెరో మరియు జేసీబి డీ .రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. డోన్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్‌లో వచ్చిన జేసీబీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story