Kurnool: ఆన్‌లైన్ బెట్టింగ్ దందాకు చెక్.. పోలీసుల వలలో నిందితులు
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. నిందితుల నుంచి రూ. 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Kurnool: ఆన్‌లైన్ బెట్టింగ్ దందాకు చెక్.. పోలీసుల వలలో నిందితులు
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా ను పోలీసులు అరెస్ట్ చేశారు.స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పక్కా సమాచారం తో ముఠా ను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణం, ఆదోని,సిరిగుప్ప(కర్ణాటక) పెద్దటుంబళం కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.నిందితులు ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసుకొని ఐపీఎల్ క్రికెట్ మాచ్ ల బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణ లో తేలిందన్నారు. నిందితుల నుండి 22 లక్షల నగదు,4 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు.పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు డిఎస్పీ భార్గవి తెలిపారు.
Next Story




