Kurnool: సొసైటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం ఆదోని ఆసుపత్రికి తరలింపు!
Kurnool: ఆస్పరి పోలీస్ స్టేషన్లో సొసైటీ ఉద్యోగి గొల్లా హనుమంతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. సీఐ వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ.
Kurnool: సొసైటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం ఆదోని ఆసుపత్రికి తరలింపు!
కర్నూలు: ఆస్పరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొల్లా హనుమంతు రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం, సహకార బ్యాంకు (సొసైటీ )నందు ఔట్సోర్స్ ఉద్యోగి గా గొల్ల హనుమంత రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని డబ్బులు వసూలు చేశాడని ఆరోపణతో ఆస్పరి సీఐ పలుమార్లు కేసు విచారణ పేరుతో హనుమంతు రెడ్డిని పలుమార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేశారని, శారీరకంగా కూడా దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వేధింపులను తట్టుకోలేక ఆయన స్టేషన్లోనే పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హనుమంతు రెడ్డి అస్వస్థతకు గురికావడంతో పోలీసులు వెంటనే ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యులు, మహిళలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.




