Owk: అవుకులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

Owk: నంద్యాల జిల్లా అవుకు చల్లా ప్రజా భవన్‌లో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 7 Oct 2026 4:00 PM IST
Owk
X

Owk: అవుకులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

నంద్యాల జిల్లా: అవుకు మండల కేంద్రంలోని చల్లా ప్రజా భవన్ నందు మండలస్థాయి సమావేశం నిర్వహించి పలు గ్రామాల వై యస్ ఆర్ సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేసిన వై యస్ ఆర్ సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలింగ్ మెంబర్ మరియు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి

చల్లా విగ్నేశ్వర రెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వైయస్ఆర్ సీపీ కార్యకర్తలందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే అవుకు మండల కమిటీకి సంబందించిన గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు

ఈ కార్డు యొక్క విశిష్టత గురించి వివరిస్తూ రాబోవు కాలంలో పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అలాగే పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట వేస్తారని, కార్యకర్తలకు కేటాయించిన పదవే కాకుండా వారివారి పనితీరును బట్టి పదోన్నతులు ఉంటాయని మరియు గుర్తింపు కార్డు కలిగిన ప్రతి కార్యకర్తకు 5 లక్షల జీవిత బీమా ఉంటుందని తెలిపారు. అలాగే వైయస్ఆర్ సీపీ పార్టీలో ఈ స్థాయిలో వున్న వ్యక్తులైన పార్టీ అధికారంలోకి రావడం కోసం అహర్నిశలు పాటుపడాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, మండల ప్రజలు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle