Nandyal: నంద్యాలలో పెయింటర్ ఉపేంద్ర హత్య కేసు ఛేదించిన పోలీసులు స్నేహితుడే హంతకుడు!

Nandyal: నంద్యాల కానాల సమీపంలో పెయింటర్ ఉపేంద్ర దారుణ హత్య. ప్రియురాలిపై కామెంట్స్ చేయడంతో బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన స్నేహితుడు భవానీ ప్రసాద్ అరెస్ట్.

R Pavankalyan, Nandyal
Published on: 5 July 2026 9:25 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాలలో పెయింటర్ ఉపేంద్ర హత్య కేసు ఛేదించిన పోలీసులు స్నేహితుడే హంతకుడు!

నంద్యాల: నంద్యాలలో పెయింటర్ ఉపేంద్ర హత్య కేసు ఛేదన.. స్నేహితుడే హంతకుడిగా తేల్చిన పోలీసులు ప్రియురాలిపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిన గొడవ.. బీర్ బాటిల్‌తో గొంతుపై పొడిచి హత్య చేసినట్లు వెల్లడి నంద్యాల మండలంలోని కానాల సమీపంలో జరిగిన పెయింటర్ ఉపేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉపేంద్ర స్నేహితుడు భవానీ ప్రసాద్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, భవానీ ప్రసాద్, ఉపేంద్ర ఇద్దరూ పెయింటర్లుగా పనిచేస్తూ సన్నిహిత స్నేహితులుగా ఉన్నారు. గత నెల 27న ఇద్దరూ కలిసి మద్యం సేవించేందుకు కానాల సమీపంలోని పొలాలకు వెళ్లారు.

మద్యం సేవిస్తున్న సమయంలో భవానీ ప్రసాద్ ప్రియురాలిపై ఉపేంద్ర అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన భవానీ ప్రసాద్, బీర్ బాటిల్‌తో ఉపేంద్ర గొంతుపై పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు భవానీ ప్రసాద్‌ను అరెస్ట్ చేసి, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు స్పెషల్ జైలుకు తరలించారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story