Nandyal: సొంత నిధులతో పింఛన్లు.. పల్లె నరసింహారెడ్డి గ్రేట్!

Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నరసింహారెడ్డి మానవత్వం.

Ramanaiah, Banaganepalle
Published on: 5 May 2026 11:18 AM IST
Nandyal
X

Nandyal: సొంత నిధులతో పింఛన్లు.. పల్లె నరసింహారెడ్డి గ్రేట్!

నంద్యాల జిల్లా: కోవెలకుంట్ల పట్టణంలో 16సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నరసింహారెడ్డి 2011 వ సంవత్సరంలో పకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన పల్లె నరసింహారెడ్డి.

అవిశ్రాంత సేవకుడు పల్లె నరసింహారెడ్డి

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాధలు ,వృద్ధులు , వితంతులు , దివ్యాంగులకు , ప్రతినెల 5 వతేదిన పింఛన్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారు.పదవి విరమణ పొందిన ప్రజా సేవకు అంకితమైన పల్లె నరసింహారెడ్డి.16 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తున్న వైనం.ప్రజల మన్ననలు అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నర్సింహారెడ్డి.ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలమరుచుకొని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దానధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు.కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా పింఛన్లు అందజేస్తున్నామన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story