Nandyal: వరుస దొంగతనాలతో డోన్ పట్టణంలో కలకలం.. ఆందోళనలో వ్యాపారులు!

Nandyal: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వరుస దొంగతనాలు. మూడు షాపుల తాళాలు పగులగొట్టిన దొంగలు.

Bharat Raj, Dhone
Published on: 26 April 2026 12:38 PM IST
Nandyal
X

Nandyal: వరుస దొంగతనాలతో డోన్ పట్టణంలో కలకలం.. ఆందోళనలో వ్యాపారులు!

నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. బేతంచర్ల సర్కిల్ పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు షాపులను టార్గెట్ చేశారు. ఇందులో మయూరి బేకరీలో సుమారు రూ.1.70 లక్షల నగదు దొంగిలించబడినట్లు సమాచారం. ఉదయం షాపులు తెరిచిన యజమానులు తాళాలు పగలగొట్టబడిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి పహారా బలపరచాలని కోరుతున్నారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story