Markapur: పనుకుమడుగు గిరిజన గూడెంలో తీరిన తాగునీటి కష్టాలు!
Markapur: మార్కాపురం జిల్లా పనుకుమడుగు గిరిజన గూడెంలో తాగునీటి సమస్య తీరింది. ట్యాంకర్ల ద్వారా నీరు అందించి బోర్లను బాగుచేయడంతో గిరిజనుల కష్టాలు పరిష్కారమయ్యాయి
Markapur: పనుకుమడుగు గిరిజన గూడెంలో తీరిన తాగునీటి కష్టాలు!
Markapur: పెద్ద దోర్నాల మండలం పనుకుమడుగు గిరిజన గూడెంలో గత పది రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గిరిజనులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 14న హెచ్ఎంటీవీ వెబ్ న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
పనుకుమడుగు గిరిజన గూడెంలోని బోర్లు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని హెచ్ఎంటీవీ కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన పెద్ద దోర్నాల ఎంపీడీవో విజయ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెంటనే చర్యలు చేపట్టారు.
తొలుత తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు నీటి ట్యాంకర్ల ద్వారా పనుకుమడుగు గిరిజన గూడెానికి మంచినీటిని సరఫరా చేశారు. అనంతరం మరమ్మతులకు గురైన బోర్లను పరిశీలించి, మోటర్లను మరమ్మతు చేయించారు. మోటర్లను తిరిగి బిగించడంతో బోర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత పది రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న గిరిజనుల కష్టాలు తీరాయి.
తమ తాగునీటి సమస్యపై స్పందించి తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడంతో పాటు బోర్ల మోటర్లను మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించిన ఎంపీడీవో విజయ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుకు పనుకుమడుగు గిరిజన గూడెం ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను వార్తా కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి కూడా వారు ధన్యవాదాలు తెలిపారు.




