Nandyal: 2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం' ప్రచారం: పాల్గొన్న ఎమ్మెల్యే!
Nandyal: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి '2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా పిన్నపురం, సుగాలిమెట్ట గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nandyal: 2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం' ప్రచారం: పాల్గొన్న ఎమ్మెల్యే!
నంద్యాల: పాణ్యo మండలం పిన్నపురం మరియు సుగాలి మెట్ట గ్రామాల్లో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి
అనంతరం సుగాలిమెట్ట గ్రామం లో రూ 12 లక్షల తో నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు పూర్తి అయిన పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుగాలిమెట్ట గ్రామం వైసీపీ పార్టీకి చెందిన మాజీ వార్డ్ మెంబర్ ఓబీ బాయ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి సమక్షం లో టీడీపీ లో చేరారు, ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కండువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




