Kallur: కల్లూరులో రూ.1.54 కోట్ల సీసీ రోడ్ల పనులకు భూమిపూజ
Kallur: కర్నూలు కల్లూరు అర్బన్ పరిధిలోని 37, 41 వార్డుల్లో రూ.1.54 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భూమిపూజ చేశారు.
Kallur: కల్లూరులో రూ.1.54 కోట్ల సీసీ రోడ్ల పనులకు భూమిపూజ
కర్నూలు: కల్లూరు అర్బన్ 37 వ వార్డ్ శాంతి నగర్ కాలనిలో సీసీ రోడ్ల పనులకు రూ 40 లక్షలు మరియు ఎన్టీఆర్ నగర్ లో సీసీ రోడ్ల పనులకు రూ 54 లక్షలు మరియు 41 వ వార్డ్ అపూర్వ హోమ్స్ నందు రూ 60 లక్షల నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి.
ఈ కార్యక్రమం లో ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ,రాఘవేంద్ర,జవ్వాజి గంగాధర్ గౌడ్,కాసాని మహేష్ గౌడ్,మహమ్మద్ అలీ, ఇమ్మనియేలు,కురువ ధనుంజయ,మరియు కాలనీ ప్రజలు,కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు,మున్సిపల్ అధికారులు సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




