Parchur: రేపు పర్చూరులో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన!

Parchur: పర్చూరులో రేపు (అక్టోబర్ 8న) హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 7 Oct 2026 10:08 AM IST
Parchur
X

Parchur: రేపు పర్చూరులో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన!

Parchur: ఈనెల 8వ తేదీన పర్చూరులో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని పర్చూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కోట్లాది రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్చూరు అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని తెలిపారు.

ఈ సందర్భంగా పర్చూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.

పర్చూరు మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గార్ల పర్యటనను విజయవంతం చేసేందుకు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ శంషుద్దీన్ మాట్లాడుతూ, పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు. ఈనెల 8న జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కోడూరి శేషా బ్రహ్మచారి మాట్లాడుతూ, పర్చూరులో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోపురి శీను, నరేంద్ర, కన్నెగంటి సాంబశివరావు,పుల్లల సుబ్బారావు, కాపు రవి, కొరిటాల సురేష్,మామిడిపాక హరి, సిరిగిరి శివ నాగేశ్వరావు, కే. లక్ష్మిబాబు,లక్కీ పోగు సుమన్, గిరి, రామ్మోహన్, వట్టిముక్కల అబ్రహం, జూపూడి మార్కు, పున్నయ్య, నాగరాజు, కొండగంటి శివ, సిరిగిరి నాగేశ్వరావు, సతీష్,

s.సుబ్బారావు, , శ్రీధర్, టీ. శ్రీనివాసరావు, కొమ్మలపాటి సురేష్,బి.ఆంజనేయులు మండల ముస్లిం అధ్యక్షుడు ఖాజావలి, సమీర్, సాంబశివరావు, తలారి శివయ్య, మల్లాది సురేష్, మా భాష, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala