Pattikonda: మద్దికేరలో 4వ రోజుకు చేరిన ఇంటింటికీ సమస్యల పరిష్కార హామీ!
Pattikonda: పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నాయకత్వంలో మద్దికేరలో 4వ రోజు 'ఇంటింటికీ'. హాజరైన వడ్డే సీమెంట్ పోలన్న కూటమి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Pattikonda: మద్దికేరలో 4వ రోజుకు చేరిన ఇంటింటికీ సమస్యల పరిష్కార హామీ!
కర్నూల్.. జిల్లా
మద్దికేర మండలంలో నాలుగో రోజు విజయవంతంగా కొనసాగిన "ఇంటింటి కార్యక్రమం"పత్తికొండ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాంబాబు నాయకత్వంలో మద్దికేర మండలంలో నిర్వహిస్తున్న "ఇంటింటి కార్యక్రమం" నాలుగో రోజు విజయవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ పరిశీలకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్డే సిమెంట్ పోలన్న పాల్గొని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.
ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజల సేవే మా లక్ష్యం – ప్రజల విశ్వాసమే మా బలం.




