Kurnool: పత్తికొండలో బీజేపీ విజయగర్జన.. బైక్ ర్యాలీతో హోరెత్తిన వీధులు!
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో బీజేపీ విజయోత్సవ సంబరాలు.
Kurnool: పత్తికొండలో బీజేపీ విజయగర్జన.. బైక్ ర్యాలీతో హోరెత్తిన వీధులు!
కర్నూలు జిల్లా: నేపథ్యంలో ఈరోజు పత్తికొండలో బిజెపి పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ అనంతరం విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మూడు రాష్ట్రాల్లో భారీ విజయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ విజయాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు ఉత్సాహభరితంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో . బైక్ ర్యాలీగా ప్రారంభమైన ఈ విజయోత్సవం పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఘనంగా కొనసాగింది. కార్యకర్తలు భారీగా పాల్గొని జై బీజేపీ నినాదాలతో పట్టణ ప్రధాన రోడ్డులో నినాదాలతో మార్మోగాయి. అనంతరం బాణ సంచారం పేల్చి, ప్రజలకు మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ కో-కన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ: భారతదేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన బాంగ్లాదేశ్ ప్రజలు తమ ఓటుతో మన దేశాన్ని కాపాడేది, మనల్ని కాపాడేది భాజపాయే, నరేంద్ర మోడీయే అని గుర్తించి ఓట్లు వేశారని, ఆ రాష్ట్ర భాజపా నాయకులు, కార్యకర్తలు ప్రాణాలొడ్డి కష్టపడి గెలుపు కోసం కృషి చేసి సరికొత్త రికార్డు సాధించి పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని అత్యధిక సీట్లతో గెలిచి కైవసం చేసుకుని మొట్టమొదటిసారిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.
దేశ ప్రజలు అభివృద్ధి, సుస్థిర పరిపాలనకు మద్దతుగా భారతీయ జనతా పార్టీకి మరోసారి అఖండ విజయాన్ని అందించారని తెలిపారు. ప్రధాని నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరింత పెద్ద విజయాలకు బాటలు వేస్తాయని అన్నారు. పత్తికొండలో కూడా బీజేపీ శక్తిని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామాంజనేయులు రామాంజనేయులు, దండి మల్లికార్జున పూనా మల్లికార్జున, రాంపల్లి రంగయ్య, లక్ష్మణరావు అడ్వకేట్ నాగేష్, సీసీ రంగన్న, నరసింహులు,మాలేకర్ విరేష్, సురేష్ నాయక్ భగవాన్ రావు, రవీంద్ర, రామ్ నాయుడు, తిమ్మరాజు, రామ్ చరణ్, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.




