Pattikonda: రైతన్న అంటే అంత చిన్నచూపా.. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దూదెకొండ గ్రామంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (HNSS) కాలువపై వంతెన నిర్మించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

G Jagadeesh, Pathikonda
Published on: 15 Jun 2026 5:18 PM IST
Pattikonda
X

Pattikonda: రైతన్న అంటే అంత చిన్నచూపా.. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన!

పత్తికొండ: దూదెకొండ గ్రామ రైతులు ఎచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువపై వంతెన నిర్మాణం విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన సుమారు 1,500 ఎకరాల సాగుభూములకు వెళ్లేందుకు వంతెన అవసరమైనప్పటికీ, గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

2017లో కాలువ నిర్మాణం అనంతరం రైతుల రాకపోకల కోసం వంతెన నిర్మిస్తామని HNS అధికారులు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారినా, ప్రజాప్రతినిధులు మారినా తమ సమస్య మాత్రం అలాగే ఉందని వాపోతున్నారు.

కాలువకు ముందు తమ పొలాలకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సరిపోయేదని, ప్రస్తుతం 4 నుంచి 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారిపై ఎద్దుల బండ్లతో ప్రయాణించే సమయంలో పలు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టాలు కూడా సంభవించాయని పేర్కొన్నారు.

అయినా HNS అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఇబ్బందులను వెంటనే గుర్తించి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

రైతన్న అంటే అంత చిన్నచూపా.. HNS అధికారుల నిర్లక్ష్యానికి ఇంకెంతకాలం బలికావాలి? అంటూ దూదెకొండ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story