Pattikonda: శాంతియుతంగా బక్రీద్.. దేవనకొండ పోలీసుల ప్రత్యేక సమావేశం

Pattikonda: పత్తికొండలో బక్రీద్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ జయన్న పిలుపు.

G Jagadeesh, Pathikonda
Published on: 26 May 2026 9:35 PM IST
Pattikonda
X

Pattikonda: శాంతియుతంగా బక్రీద్.. దేవనకొండ పోలీసుల ప్రత్యేక సమావేశం

Pattikonda: అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దల హాజరు. పత్తికొండ బక్రీద్ పండుగను పత్తికొండ మండలంలో శాంతియుత వాతావరణంలో, పరస్పర మత సామరస్యంతో నిర్వహించుకోవాలని పత్తికొండ సీఐ జయన్న సూచించారు. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పత్తికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పెద్దలు, మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రజలు పరస్పర గౌరవ భావంతో పండుగలను జరుపుకోవడం పత్తికొండ ప్రాంత ప్రత్యేకత అని 2005 హాక్కు చల్ల అన్నారు. చిన్న చిన్న వి వాదాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.

యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఐ జయన్న సూచించారు. ఇటీవల చిన్న వయస్సు పిల్లలకు బైకులు ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లైసెన్స్ లేని మైనర్ పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి

ప్రమాదాలకు చర్యలు దారితీను న్నాయిు ని పేర్కొన్నారు. అలాగే కొంతమంది యువత మత్తు పదార్ధాలకు బానిసవుతున్న పరిస్థితి సమాజానికి ప్రమాదకరంగా మారుతోందని సీఐ జయన్న అన్నారు. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మొబైల్ ఫోన్లను ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, గంజాయి లేదా ఇతర గమనించాలని మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామాల్లో రాత్రి వేళల్లో అనవసర గుంపులు, బైక్ రేసింగ్, శబ్ద కాలుష్యం, పండుగల పేరుతో అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. పండుగ సమయంలో పోలీస్ శాఖకు గ్రామ పెద్దలు, మత పెద్దలను సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, చర్చి ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story