Kurnool: పత్తికొండలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు.. ఎమ్మెల్యేకు ఆహ్వానం
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్వి. ప్రసాద్ తెలిపారు.
Kurnool: పత్తికొండలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు.. ఎమ్మెల్యేకు ఆహ్వానం
కర్నూలు జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీభగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సగర/ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్వి. ప్రసాద్ తెలిపారు. పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి లను శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలకు రావాలని డైరెక్టర్ ఎల్వి. ప్రసాద్, పత్తికొండ సగర/ఉప్పర సంఘం సభ్యులతో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భువి నుండి దివికి గంగను తీసుకువచ్చిన మహర్షి శ్రీ భగీరథ మహర్షి అని, అలాంటి గొప్ప మహర్షి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని సగరులు/ ఉప్పరులు ఏకమై శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఉప్పర సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎస్. యు.వెంకటేశ్వర్లు, యు.బాలప్ప, గౌరవ అధ్యక్షులు టీచర్ నరసింహమూర్తి, ట్రెజరర్ నరసింహమూర్తి, సభ్యులు తిమ్మప్ప, రవి, నాగరాజు, హరీష్, ప్రసాద్, నాగేష్, వీరాంజనేయులు, పెద్దయ్య, తిమ్మప్ప, నాగేష్, నాగరాజు, మల్లి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.




