Pattikonda: పత్తికొండలో టీడీపీ మహానాడు వేడుకలు
Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు.
Pattikonda: పత్తికొండలో టీడీపీ మహానాడు వేడుకలు
Pattikonda: పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా కొనసాగుతోంది. పత్తికొండ మండలం క్లస్టర్-1 రమ్య రిసార్ట్ నందు నిర్వహించిన మహానాడు వర్చువల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే . ఈ.శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహానీయుడు N. T. రామారావు గారి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు.
పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో కార్యకర్తలకు భోజన సదుపాయాలు, త్రాగునీటి ఏర్పాట్లు చేసి మహానాడు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. అలాగే మై టీడీపీ యాప్ ద్వారా నియోజకవర్గం వ్యాప్తంగా 4007 కార్యకర్తలు,నాయకులు స్కాన్ చేసుకొని ఈ మహానాడు లో పాల్గొన్నారు.కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే పత్తికొండ నియోజకవర్గం రెండవ స్థానంలో నిలవడం పార్టీ శ్రేణుల కృషికి నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు… ప్రజల ఆశయాల కోసం, పేదల అభ్యున్నతి కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన మహోన్నత ఉద్యమం. అలాంటి పార్టీ మహానాడు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి కార్యకర్త తమ సొంత కార్యక్రమంలా భావించి విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది.
మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజలకు అందించాల్సిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించబడతాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ సంక్షేమం మరియు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోంది. పత్తికొండ నియోజకవర్గ కార్యకర్తలు చూపిస్తున్న ఐక్యత, క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధత రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. రేపు జరగబోయే మహానాడు కార్యక్రమంలో కూడా ప్రతి నాయకుడు, కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ పోలన్న, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




