Markapuram: అప్పుల బాధతో రైతు బలవన్మరణం.. పెద్దకందుకూరులో విషాదం!

Markapuram: మార్కాపురం పెద్దకందుకూరులో అప్పుల భారంతో పురుగుల మందు తాగిన కౌలు రైతు కోడావత్ పెద్ద రామయ్య గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Aug 2026 11:58 PM IST
Markapuram
X

Markapuram: అప్పుల బాధతో రైతు బలవన్మరణం.. పెద్దకందుకూరులో విషాదం!

మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో అప్పుల భారంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన కోడావత్ పెద్ద రామయ్య (46) తనకు ఉన్న మూడు ఎకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గత కొన్నేళ్లుగా పంటలకు సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్ర అప్పులపాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో గత నెల 23న పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా, కుటుంబ సభ్యులు వెంటనే మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల క్రితం గుంటూరుకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story