Peddaraveedu: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

Peddaraveedu: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చెట్లమిట్ట గ్రామంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా స్థానిక పిహెచ్‌సి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ జరిగింది.

Srikanth Singam, Markapur
Published on: 16 May 2026 12:58 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చెట్లమిట్ట గ్రామంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా చెట్లమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టి డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా MPHEO డి. సత్యామయ్య మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి శుక్రవారం “ఫ్రైడే–డ్రైడే” పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. అలాగే “చెక్ – క్లీన్ – కవర్” అనే మూడు ముఖ్యమైన అంశాలను ప్రతిరోజూ పాటించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఏ. భరత భూషణ్, ల్యాబ్ టెక్నీషియన్ బి. నవీన్ కుమార్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story