Nandyal: కానిస్టేబుల్ కరీం హత్య కేసులో మాజీ నక్సల్ దిబ్బ శామ్యూల్ అరెస్ట్
Nandyal: 34 ఏళ్ల క్రితం కానిస్టేబుల్ కరీంను హత్య చేసిన పీపుల్స్ వార్ నక్సలైట్ దిబ్బ శామ్యూల్ అలియాస్ మాడుగుల సుబ్బన్నను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Nandyal: కానిస్టేబుల్ కరీం హత్య కేసులో మాజీ నక్సల్ దిబ్బ శామ్యూల్ అరెస్ట్
Nandyal: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 34 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఒకనాటి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్ ఎట్టకేలకు పోలీసు నిఘా విభాగానికి దొరికిపోయాడు.
34 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కరీం ను తుపాకితో కాల్చి చంపిన పీపుల్స్ వార్ నక్సల్ దిబ్బ శామ్యూల్, ఇలియాస్ హరి అనే నిందితుడు ఆత్మకూరు పోలీసుల అదుపులో ఉన్నారు. అదుపులో ఉన్న నక్సలైటును రహస్యంగా విచారిస్తున్నారా లేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారా అనే విషయాన్ని పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు.
ఒకనాటి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ కార్యకలాపాలకు కేంద్ర బిందువు ఇప్పటి నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల.
1992లో తీవ్రంగా ఉన్న పీపుల్స్ వార్ భవనాసి దళం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కరీం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా నల్ల కాలువ నల్లమల అటవీ ప్రాంతంలో పీపుల్ సార్ నక్సలైట్ దిబ్బ శామ్యూల్ ఇలియాస్ హరి తుపాకితో కానిస్టేబుల్ కరీం ను కాల్చి చంపాడు.
అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేకెత్తించింది. ఈ హత్యపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
అయితే ఇప్పటివరకు కానిస్టేబుల్ కరీం ను కాల్చి చంపిన నక్సలైట్ దిబ్బ శామ్యూల్ ఆచూకీ తెలియలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లో భాగంగా 34 ఏళ్ల తర్వాత అప్పటి పీపుల్స్ వార్ నక్సల్ దళంలో పనిచేసిన దిబ్బ శామ్యూల్ ఊరఫ్ మాడుగుల సుబ్బన్న కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసునిగా విభాగం పసి కట్టింది.
పీపుల్స్ వార్ నక్సల్ దెబ్బ శ్యామ్యాల్ ను అదుపులోకి తీసుకొని ఆత్మకూరుకు తరలించినట్లు సమాచారం.
నక్సలైట్ మాడుగుల సుబ్బన్న రహస్య ప్రదేశంలో విచారించి న్యాయస్థానం ముందు హాజరు పరిచయం రిమాండ్ కు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.
నక్సలైట్ దిబ్బ శామ్యూల్ వేంపెంట గ్రామానికి చెందిన వ్యక్తి. భవనాసి దళంలో పనిచేస్తూ దళంలోనే తన సహచర నక్సల్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు. మహానంది మండలం మసీదుపురం మాజీ నక్సల్ జ్యోతి.




