Nandikotkur: నందికొట్కూరు గర్ల్స్ హైస్కూల్లో పీఎం శ్రీ స్కూల్ రివ్యూ!

Nandikotkur: నందికొట్కూరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వరావు, మాధురిలత. పీఎం శ్రీ విద్యా వసతులపై క్షేత్రస్థాయి సమీక్ష.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 7 July 2026 12:08 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు గర్ల్స్ హైస్కూల్లో పీఎం శ్రీ స్కూల్ రివ్యూ!

నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరులో పీఎం శ్రీ స్కూల్ రివ్యూలో భాగంగా జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ను పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్. పీఎం శ్రీ స్కూల్ రివ్యూ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూలును రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వరావు , (ఏఎంఓ), (ఎస్ఎస్ఏ) మాధురి లతా సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ ల్యాబ్ మరియు ఈ-లైబ్రరీని పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానం, విద్యాభ్యాస పనితీరుపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా స్టేట్ అబ్జర్వర్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి, వారి సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలు ప్రశంసనీయంగా ఉన్నాయని, ఇదే విధంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story