Markapuram: పొగాకు రైతుల భారీ నిరసన.. వేలం నిలిపివేత!

Markapuram: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కాపురం జిల్లా పొదిలి వేలం కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు.

MADARVALI, MARKAPURAM
Updated on: 4 July 2026 10:51 AM IST
Markapuram
X

Markapuram: పొదిలి వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల తీవ్ర నిరసన!

మార్కాపురం: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపొతే ఆత్మహత్యలే శరణ్యమనీ, ప్రభుత్వం దిగివచ్చి రైతులను ఆదుకొవాలని మార్కాపురంజిల్లా పొదిలి పొగాకువేళం కేంద్రం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్వింటా రూ 20 వేలు తగ్గకుండా కొనాలని సూచించిన వ్యాపారులు మాత్రం రూ 16 వేలకు మించి కొనడం లేదని రైతులు తీవ్రంగా నష్టపొతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు వేలాన్ని నిలుపుదల చేసి గిట్టుబాటు ధర కల్పించేంతవరకు వేలం నిర్వహించవద్దని అధికారులకు తెలిపారు.

ఇప్పటికే పెట్టుబడులకు రైతులు అప్పుల పాలయ్యారని గిట్టుబాటు ధర కల్పించక పొతే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ప్రభుత్వం తక్షణమే ‌స్పందించి నొబిడ్ లేకుండా బేళ్ళన్ని కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story