Dhone: డోన్‌లో వాహనాల తనిఖీ.. రూ. 1 లక్ష జరిమానా!

Dhone: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా భారీ వాహనాల తనిఖీ చేపట్టారు.

Bharat Raj, Dhone
Published on: 14 May 2026 2:41 PM IST
Dhone
X

Dhone: డోన్‌లో వాహనాల తనిఖీ.. రూ. 1 లక్ష జరిమానా!

డోన్: నంద్యాల జిల్లా డోన్ పట్టణం మరియు రూరల్ పరిధిలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. సీఐలు, ఎస్ఐలు, ఎంవీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో క్రేన్లు, జేసీబీలు, లారీలు తదితర భారీ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక వాహనం సరైన పత్రాలు లేకపోవడంతో పాటు రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

మరో మూడు వాహనాలకు కలిపి సుమారు రూ.1 లక్ష జరిమానా విధించారు. హైవేలపై ప్రమాదాలు నివారించేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, అనుమతులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story