Kurnool: గుడిపాడు గ్రామంలో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్!

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ రాజాకుళాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

C. Ganesh, Kodumuru
Published on: 14 Nov 2026 10:50 AM IST
Kurnool
X

Kurnool: గుడిపాడు గ్రామంలో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్!

Kurnool: కర్నూలు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్ గూడూరు ఎస్ఐ రాజాకుళాయప్ప ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందితో కలిసి గుడిపాడు గ్రామంలో విస్తృతంగా CASO (కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, అనుమతి పత్రాలు లేని అనధికారిక వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర అవసరమైన ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

అలాగే త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru