Bestavaripeta: పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు!
Bestavaripeta: బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది.
Bestavaripeta: పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికలు!
Bestavaripeta: మార్కాపురం జిల్లా,, బేస్తవారిపేట మండలం నేక్నాంబాద్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇరువర్గాల మధ్య పరస్పర విభేదాలు తలెత్తడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, హెచ్చరికలు జారీ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారు.




