Markapuram: చెంచు కాలనీలో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్ ఆయుధాలు బైక్‌లు సీజ్!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని చెంచు కాలనీలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
Markapuram: చెంచు కాలనీలో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్ ఆయుధాలు బైక్‌లు సీజ్!
పెద్దారవీడు: మండలంలోని చెంచు కాలనీలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. త్రిపురాంతకం సీఐ హసన్ , పెద్దారవీడు, త్రిపురాంతకం ఎస్సై లు సైదుబాబు, శివరామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పాత నేరస్తుల వివరాలను పోలీసులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటి తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 బ్రౌజ్‌లు, 30 ఆరోస్, 6 బైక్‌లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, వాటి యజమానుల వివరాలను సేకరించారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పోలీసుల చర్యలను స్వాగతిస్తూ, ఇలాంటి తనిఖీలు తరచూ నిర్వహించాలని కోరారు.




