Atmakur: ఆత్మకూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. రౌడీ షీటర్లలో వణుకు

Atmakur: ఆత్మకూరులో పోలీసులు భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సునీల్ షారాన్ ఆదేశాలతో సిఐ, ఎస్సైలు రౌడీ షీటర్లు, గంజాయి నేరస్థుల ఇళ్లలో సోదాలు చేశారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 10 May 2026 4:06 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో పోలీసుల మెరుపు తనిఖీలు.. రౌడీ షీటర్లలో వణుకు

ఆత్మకూరు: అసాంఘిక కార్యకలాపాలతో అసాంఘిక శక్తులుగా మారి చట్టాలను ఉల్లంఘిస్తే కటకటాల్లోకి వెళ్లక తప్పదని ఆత్మకూరు పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాన్ ప్రత్యేక ఆకస్మిక ఆపరేషన్లలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో పలు అనుమానిత ప్రదేశాల్లో ఆత్మకూరు సిఐ, ఎస్సై మహేశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి స్థానిక పోలీసు బలగాలతో కార్డెన్ అండ్ సర్చ్ చేపట్టారు. నేరచరిత్ర ఉన్న శక్తులు , రౌడీ షీటర్లు, నాటుసారా, గంజాయి నేరస్థుల నివాస ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగల నుండి జాగ్రత్తగా ఉండాలని, తమను ఎవరైనా వెంబడిస్తుంటే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని మోటార్ బైకులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. సైబర్ నేరస్తులు రోజురోజుకు కొత్త మోసాలకు పాల్పడి తప్పించుకుంటున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండి సమస్యను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు అవగాహన కలిగించారు.

అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, పిప్పాకిటర్లు, మద్యాన్ని రోడ్లపై బహిరంగంగా విచ్చలవిడిగా అమ్మే వారికి మార్నింగ్ ఇచ్చారు. బస్టాండ్ ప్రాంతంలో, ఆత్మకూరు పట్టణంలో దురుసుగా ప్రవర్తిస్తూ, ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ అంతరాయానికి కారకులైన యువకులను హెచ్చరించారు. ఇలాంటి శక్తుల నుంచి ఇబ్బంది కలిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story