Giddalur: మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం బరిలోకి ఎమ్మెల్యే సోదరుడు!
Giddalur:గిద్దలూరు మున్సిపల్ పోరు వేడెక్కింది! కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ, వైసీపీ నుండి డాక్టర్ భూమా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ నామినేషన్‌కు సిద్ధమయ్యారు.
Giddalur: మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం బరిలోకి ఎమ్మెల్యే సోదరుడు!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ జె.వి. నారాయణ సిద్ధమవుతుండగా, వైసీపీ నుంచి డాక్టర్ భూమా నరసింహారెడ్డి నామినేషన్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ అనూహ్యంగా నామినేషన్ బరిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భారీగా ఆయన అనుచరులతో నామినేషన్‌కు సిద్ధం కావడంతో గిద్దలూరులో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కూటమిలో చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందనే అంశంపై ఆసక్తి పెరిగింది. కృష్ణ కిషోర్ నామినేషన్‌తో కూటమిలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు పట్టణప్రజల్లో హాట్ టాపిక్‌గా మారింది.




