Nandyal: రేపే ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. కలెక్టర్ కీలక ప్రకటన
Nandyal: నంద్యాల జిల్లా వ్యాప్తంగా మే 18వ తేదీ సోమవారం నాడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించనున్నారు.
Nandyal: రేపే ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. కలెక్టర్ కీలక ప్రకటన
నంద్యాల: జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 18వ తేదీ (సోమవారం)న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందన్నారు.
వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా సమర్పించడమే కాకుండా, meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు. అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్‌సైట్‌లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలనే జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




