Panyam: కర్నూలు - నంద్యాల హైవేపై తప్పిన బస్సు ప్రమాదం

Panyam: కర్నూలు - నంద్యాల జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

R Pavankalyan, Nandyal
Published on: 12 July 2026 8:57 AM IST
Panyam
X

Panyam: కర్నూలు - నంద్యాల హైవేపై తప్పిన బస్సు ప్రమాదం

Panyam: పాణ్యం లోని విజయానికేతన్ స్కూల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఈ బస్సులో 27 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సుకు స్వల్పంగా నష్టం వాటిల్లింది.

సమాచారం అందుకున్న పాణ్యం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా పంపించారు.

ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు. టైర్ బ్లాస్ట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు మరింత విచారణ చేపట్టారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story