Dhone: డోన్ ఆర్టీఓ అధికారుల కొరడా: ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న బస్సు సీజ్.. రూ. 4.67 లక్షల జరిమానా!

Dhone: నంద్యాల జిల్లా డోన్ మండలం అముక్తాడు టోల్ ప్లాజా వద్ద ఆర్టీఓ అధికారులు జరిపిన తనిఖీల్లో ట్యాక్స్ చెల్లించని ప్రైవేట్ బస్సు పట్టుబడింది. దీనికి రూ. 4,67,750 జరిమానా విధించారు.

Bharat Raj, Dhone
Published on: 30 April 2026 6:24 AM IST
Dhone
X

Dhone: డోన్ ఆర్టీఓ అధికారుల కొరడా: ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్న బస్సు సీజ్.. రూ. 4.67 లక్షల జరిమానా!

డోన్ (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా డోన్ మండలం అముక్తాడు టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సాధారణ వాహన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పట్టుబడింది. కర్నూలుకు చెందిన (AP39WA5008) బస్సు ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా కర్నూలు నుంచి బెంగళూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా అధికారులకు చిక్కింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి రూ.4,67,750 జరిమానా విధించారు.

అనంతరం బస్సును డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు. ఈ తనిఖీలు తెల్లవారుజామున వరకు కొనసాగాయి. మోటారు వాహనాల తనిఖీ అధికారి టి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి తనిఖీలు మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story