Pothireddypadu: పోతిరెడ్డిపాడు గేట్ రోప్ ఘటనపై విచారణ జరపాలి: సీపీఐ డిమాండ్
Pothireddypadu: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటు రోప్ తెగిపోవడంపై సమగ్ర విచారణ జరిపి, 10 గేట్లకు కొత్త రోప్‌లు వేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Pothireddypadu: పోతిరెడ్డిపాడు గేట్ రోప్ ఘటనపై విచారణ జరపాలి: సీపీఐ డిమాండ్
నంద్యాల జిల్లా: జూపాడు బంగ్లా పోతిరెడ్డిపాడు గెట్ రోప్ ఘటనపై సమగ్ర విచారణ జరిపాలి.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన.. గేటు భద్రత కంటే కాంట్రాక్టు పనులు వైపే అధికారుల ముగ్గు.. సంబంధిత అధికారుల పై ఈఎన్సి కి పిర్యాదు చేస్తాం.. తాత్కాలిక పనులు కాకుండా 10గేట్ల రోఫ్ లకు శాశ్విత పనులు చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు డిమాండ్.
రాయలసీమ ప్రాంతానికి త్రాగు, సాగునీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రమాద ఘటనపై రాష్ట్ర ఇంజనీర్ చీఫ్ సమగ్ర విచారణ జరిపించాలని, గేట్ల పరిరక్షణ కంటే కాంట్రాక్టర్లు చేసే పనులపైనే అధికారులు ముగ్గు చూపుతున్నారని, అసలు గేట్లు ఎత్తే చోట అధికారులు ఎందుకు లేరని, అవగాహన లేని వారితో గేట్లు ఎత్తడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో 10వ గేటు ఇప్పుడు 9వ గేటు రోఫ్ తెగిపోతే తాత్కాలిక ఉపశమనం కోసం నిధులు కేటాయిస్తున్నారు.
తప్ప 20 సంవత్సరాల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరమ్మత్తులకు శాశ్వత పనులకై నిధులు ఎందుకు కేటాయించడం లేదని అన్ని గెట్ రోఫ్ ల కొత్త వాటికై నిధులు విడుదల చేయాలని, అధికారుల నిర్లక్ష్యం, 10 నూతన గేట్ల రోఫ్ లకై ఈఎన్సి, నీటిపారుదల శాఖ మంత్రి ద్రుష్టి పెట్టాలని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆధ్వర్యంలో తెగిపోయిన గెట్ రోఫేను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి 20 సంవత్సరాలు గడుస్తున్నా గేటు రోప్లు ఎందుకు నూతనంగా మార్చలేదని వారు ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్టు, కెనాల్ పనులకు అయితే కోట్ల రూపాయల కేటాయిస్తారు తప్ప రాయలసీమ ప్రాంత ప్రాణధారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్ల నూతన నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించలేదని వారు ప్రశ్నించారు.
ఇందులో పనిచేస్తున్న అధికారులు గేట్ల పర్యవేక్షణ పనుల కంటే కాంట్రాక్టర్ల పనుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతూ ధనార్జనే ద్యేయంగా అలవాటు పడ్డారని వారు అన్నారు. అనేకసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు విచారణ చేయాలన్నారు. అసలు గేట్ రోఫ్ లు ఎత్తేటప్పుడు, దించేటప్పుడు అధికారులు ఎందుకు లేరని ఎవరితో గేట్లు దించుతున్నారో అధికారులు విచారణ చేయాలని వారన్నారు.. గతంలో 10వ గేటు రోప్ తెగిపోతే 20 లక్షల కేటాయించారని, ఇప్పుడు 9వ డేటు రోప్ తెగిపోతే 45 లక్షల కేటాయించారని, ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారో లేదో చూడాలన్నారు.
ప్రతిసారి రోఫ్ తెగిపోతే ఇలాగే నిధులు కేటాయిస్తారని తాత్కాలిక ఉపశమనం కంటే పర్మనెంట్ ఆలోచన చేయాలని 10 గేట్ల నూతన గెట్ రోఫ్ లు ఏర్పాటు చేయాలని నీటి శాఖ మంత్రి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.. ప్రాజెక్టులు కృంగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం తగదన్నారు. పోతిరెడ్డిపాడు రక్షణకు సిపిఐ పోరాటం కొనసాగిస్తుందని వారన్నారు..ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాషా నరసింహ తదితరులు పాల్గొన్నారు.




