Veligonda: రూ.300 కోట్ల పరిహారం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు! ఇంచార్జి

Veligondaకూటమి ప్రభుత్వం రూ.300 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఇంచార్జి ఎరిక్షన్ బాబుకు నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 Jun 2026 1:03 PM IST
Veligonda
X

Veligonda: రూ.300 కోట్ల పరిహారం.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు! ఇంచార్జి

వెలిగొండ: పెద్దారవీడు మండలంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని 2,351 మంది లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల నిర్వాహితుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసిన యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబును గుండంచర్ల, కలనూతల, సుంకేసుల గ్రామాల నిర్వాసితులు కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

కార్యక్రమంలో పెద్దారవీడు మండల తెలుగుయువత అధ్యక్షుడు నందిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సీనియర్ నాయకులు చింతగుంట సుబ్బారామిరెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, భీమవరం ప్రసన్న కుమార్, నల్లూరి నాగయ్య, దర్శనం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పరిహారం అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమానికి ఇదొక కీలకమైన ముందడుగని పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story