Srisailam: ఆగష్టు 15 నుంచి శ్రీశైలంలో ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు!

Srisailam: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి 9వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 29 July 2026 8:24 AM IST
Srisailam
X

Srisailam: ఆగష్టు 15 నుంచి శ్రీశైలంలో ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు!

Srisailam: • 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

• ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు

• వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమశాస్త్రానుసారంగా వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం

• దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతిస్సిద్ధవట ఆలయంలో అభివృద్ధి పనులు,

• ఆగష్టు 7న కొలనుభారతి క్షేత్రంలో శాకంభరీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడుగారి అధ్యక్షతన ధర్మకర్తల మండలి 9వ సమావేశం బుధవారం నిర్వహించారు.

శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బుధవారం జరిగిన సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగిందన్నారు.

సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ రేపు ( 29.07.2026) జరిగే శాకంభరీ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండేందుకు రాష్ట్రం మరియు దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు తలపెట్టిన వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం జరుగుతుందన్నారు. వరుణయాగం, శ్రీస్వామివారికి సహస్రఘటాభిషేకం, స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, కార్యక్రమ సంబంధి హోమాలు, జపాలు, పారాయణలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాబోవు శ్రావణమాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.

శ్రావణమాసంలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరిగేవిధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

కాగా సమావేశంలో తీసుకోబడిన ముఖ్యమైన నిర్ణయాల గురించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్‌నాయుడు వివరించారు.

• ఆగష్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలలో సంస్కరణాత్మక మార్పులు. టి.టి.డి తరహాలో నిర్దిష్టమైన విధానం అమలు. సిఫారసు లేఖలు కనీసం 48 గంటలు ముందస్తుగా పంపడం తప్పనిసరి. ప్రోటోకాల్ టికెట్ల జారీలో పూర్తి పారదర్శకత.

• సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దిష్ట వేళలలో మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు. ప్రోటోకాల్ దర్శనాలు జారీకి కూడా ఆన్‌లైన్ విధానం అమలు.

• లోకకల్యాణం కోసం అయిదు రోజులపాటు అనగా తేది : 07.08.2026 నుండి 11.08.2026 వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకం ఆగమశాస్త్రానుసారంగా జరిపించడం.

• శ్రీశైలదేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగష్టు 7 శుక్రవారం రోజున సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

• శ్రీశైలదత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవట ఆలయ జీర్ణోద్ధారణ చేయాలని తీర్మానించడమైనది. దశల వారిగా ఈ ఆలయంలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన అంచనాలను త్వరలోనే రూపొందించడం జరుగుతుంది.

• ఆలయముందుభాగంలో సాలుమండపాల నిర్మాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. అయితే క్యూకాంప్లెక్సు నిర్మాణం, క్షేత్రపరిధిలో శౌచాలయాల నిర్మాణం, తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణం, సాలుమండపాల నిర్మాణం మొదలైనవన్నీ ప్రాధాన్యతా క్రమములో చేపట్టడం జరుగుతుంది.

• సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలో ఎంపిక చేసిన 20 ప్రదేశాలలో శౌచాలయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్ నందు 11 గదులు ఉండేవిధంగా వీటి నిర్మాణం చేపట్టబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ నిర్మాణానికి సుమారు రూ. 25 లక్షల అంచనా వ్యయంతో టైప్ –ఎ మోడల్ నందు నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క బ్లాక్‌లో అదనంగా స్నానపుగదులు కూడా ఏర్పాటు చేయబడుతాయి.

• భక్తుల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు, మరియు యోగివేమారెడ్డి సత్రం వెనుకభాగంలో రూ. 24లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మించాలని తీర్మానించడం జరిగింది.

• శ్రావణమాసోత్సవాలలో ప్రధాన గోపురాలకు విద్యుద్దీపాలంకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది.

• భక్తుల సౌకర్యార్థం నందీశ్వర డార్మెటరీలో డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 39 లక్షలు.

• అదేవిధంగా నీలకంఠేశ్వర డార్మెటరీ నందు కూడా డక్టబుల్ ఎయిర్ కూలర్ ( Ductable Air cooler) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. దీని అంచనా వ్యయం రూ. 23 లక్షలు.

• భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్సు నందు అదనపు వాటరు కూలర్సును ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వీటి అంచనా వ్యయం రూ. 5లక్షలు

• ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు విధానంలో పిలువబడిన టెండర్లను అనుసరించి రాబోవు 2027 సంవత్సరపు వివిధ రకాల క్యాలెండర్లను మరియు రెండు రకాల డైరీలను ముద్రించాలని నిర్ణయం.

• స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు

• అన్నప్రసాద వితరణ భవనములో కూడా రూ. 39.90 లక్షల అంచనా వ్యయంతో స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్ల ఏర్పాటు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story