Peddaraveedu: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. పెద్దారవీడులో కృష్ణమ్మకు ఘనంగా జలహారతి!
Peddaraveedu: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా పెద్దారవీడు మండలంలో కృష్ణమ్మకు ఘనంగా జలహారతి నిర్వహించిన టీడీపీ నేతలు.
Peddaraveedu: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. పెద్దారవీడులో కృష్ణమ్మకు ఘనంగా జలహారతి!
మార్కాపురం: 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసి కృష్ణమ్మ జలాలను విడుదల చేసిన చారిత్రాత్మక ఘట్టం అనంతరం పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు.
మార్కాపురం నియోజకవర్గ పోలింగ్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చి పసుపు–కుంకుమ సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కృష్ణమ్మ జలాలు ఈ ప్రాంత రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఎకరం పచ్చగా మారాలని, ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దశాబ్దాలుగా కరవుతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తొలగి, ఇకపై పాడిపంటలతో ప్రాంతం కళకళలాడాలని కోరుకున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, రైతుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఆర్‌డీసీ డెవలప్‌మెంట్ మెంబర్ గొట్టం శ్రీనివాసరెడ్డి, నక్క శ్రీను, చట్లమెట్ల సొసైటీ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, వెన్న బోడిరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆనేకాళ్ల శ్రీనివాసరెడ్డి, దేవరాజుగట్టు ఎంపీటీసీ దండా వెంకటేశ్వరరెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




