Markapur: మార్కాపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పీవీ కృష్ణారావు ప్రమాణస్వీకారం

Markapur: మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పీవీ కృష్ణారావు ప్రమాణస్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Jun 2026 8:29 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పీవీ కృష్ణారావు ప్రమాణస్వీకారం

Markapur: మార్కాపురం జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన పీవీ కృష్ణారావు ఆదివారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం నిర్వహించిన అభినందన సభలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ 20 సూత్రాల అమలు పథకం కమిటీ చైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్, రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఎస్. శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు బెల్లంకొండ విజయలక్ష్మి, శాసనాల సరోజిని, శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అత్యంత బలమైన రాజకీయ పార్టీగా ఎదిగిందని, ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.

నూతన జిల్లాకు తొలి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పీవీ కృష్ణారావు అన్నారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. "నా ఒంటిపై పడే ప్రతి శాలువా బీజేపీ పార్టీలో నా బాధ్యతను మరింత బలంగా గుర్తు చేస్తుంది" అని ఆయన భావోద్వేగంగా తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన సన్మానం చేసి శాలువాలు కప్పి అభినందించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story