Kurnool: పేపర్ లీకేజీలపై యువత పోరాడాలి: మాజీ మంత్రి రఘువీరారెడ్డి!
Kurnool: పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా విద్యార్థులు, యువత ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
Kurnool: పేపర్ లీకేజీలపై యువత పోరాడాలి: మాజీ మంత్రి రఘువీరారెడ్డి!
కర్నూలు: భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల పేపర్లు లీకేజీలు జరగకుండా విద్యార్థులు యువత ఏకమై పోరాటాలు చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి కర్నూలు లో అన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరగేంతవరకు పోరాటం చేయాలన్నారు.
ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ కోసం ఉపయోగించకూడదని ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలన్నారు. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నం చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ఈ సమావేశాల్లో ఎల్ నీనో చర్చించాలన్నారు. ఈ సమావేశాలకు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ నాయకులు నాగమధు యాదవ్, క్రాంతి నాయుడు, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. రఘువీరా రెడ్డి. మాజీమంత్రి.




