Sundipenta: ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రజా సంఘాల ఆగ్రహం!

Sundipenta: శ్రీశైలం మండలం సుండిపెంటలో ప్రభుత్వ భూములు, నీటిపారుదల శాఖ క్వార్టర్లు కబ్జాకు గురవుతున్నాయి.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 7 Aug 2026 8:36 AM IST
Sundipenta
X

Sundipenta: ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రజా సంఘాల ఆగ్రహం!

Sundipenta: యదేచ్చగా అక్రమ కట్టడాలు... ఆపే నాధుడే కరువు

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు..

పాగా వేస్తున్న కబ్జాదారులు..!

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

యథేచ్ఛగా నీటిపారుదల శాఖ భూ కబ్జా అక్రమ నిర్మాణాలు క్వార్టర్ల విక్రయాలు..!

అధికారుల కళ్లు గప్పి కాదు.. అధికారుల కళ్ల ముందే కోట్లాది రూపాయల భూదందా..!

లక్షల రూపాయలకు గజాల లెక్కన అమ్మకాలు.. పట్టించుకోని యంత్రాంగం..!

జిల్లా కలెక్టర్ స్పందించాలని ప్రజా సంఘాల డిమాండ్

శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. అది శిఖమైనా, నీటిపారుదల శాఖ క్వార్టర్లయినా సరే, కబ్జాదారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన అక్రమార్కులకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. అధికారుల కళ్లు గప్పి కాదు.. ఏకంగా అధికారుల కళ్ల ముందే కోట్లాది రూపాయల విలువైన నీటిపారుదల శాఖ భూములు అంగడి సరుకుగా మారుతున్నాయి అక్రమార్కులు అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు

రాజకీయ అండతో బహిరంగ విక్రయాలు..!

నీటిపారుదల శాఖకు స్థలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు పాత గృహాలు ఖాళీ స్థలాలను కొందరు అక్రమార్కులు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోయినా, కేవలం రాజకీయ అండదండలతో ఆ స్థలాలను సామాన్యులకు లక్షల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు వెలుస్తున్నాయి, పునాదులు పడుతున్నాయి. సాక్షాత్తూ ప్రభుత్వ శాఖకు చెందిన భూమి అని తెలిసినా, కొనుగోలుదారులను మభ్యపెట్టి ఈ దందా సాగిస్తున్నారు

నిమ్మకు నీరెత్తినట్లు శ్రీశైలం మండల అధికారులు..!

ఒకవైపు కోర్టు ఆదేశాలతో సర్వేలు నిర్వహించి ఇంకా కోర్టులో కేసు నడుస్తున్న జిల్లా కలెక్టర్ కోర్టును కూడా లెక్కచేయకుండా సుండి పెంట గ్రామంలోని ఊరి నడిబొడ్డున బస్టాండ్ సమీపంలో ఆక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న మరోవైపు కళ్ళముందే నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మౌనం వహించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్డుకు రెండున్నర మీటరు ఎటువంటి కట్టడాలు ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ భారీ గుంత తవ్వినా కూడా పట్టించుకుండే నాధుడే కరువయ్యాడు మరోవైపు సుండుపెంటలో ఎక్కడ లేని విధంగా సెల్లార్ మధ్యలో షాపు కాంప్లెక్స్ పైన లాడ్జి నిర్మాణం చేస్తున్నప్పటికీ అటువైపు అధికారులు కన్నెత్తి చూడలేదంటే ఏమేరా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

ఈ అక్రమ కట్టడం వల్ల బస్టాండ్ లో వేచి ఉన్న ప్రయాణికులకు బస్సులు కనిపించకపోగా ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు సర్వేలు కాగితాలకే పరిమితమా? క్షేత్రస్థాయిలో కబ్జాలు ఆపే నాథుడే లేడా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపి మౌనం వహిస్తున్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story