Kurnool: బ్లడ్ గ్రూపు వేరైనా కిడ్నీ మార్పిడి సక్సెస్.. మెడికవర్ విజయం
Kurnool: కర్నూలు మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.
Kurnool: బ్లడ్ గ్రూపు వేరైనా కిడ్నీ మార్పిడి సక్సెస్.. మెడికవర్ విజయం
కర్నూలు: ఎన్టీఆర్ వైద్య సేవలో అరుదైన ఆపరేషన్లు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. మెడికవర్ హాప్పిటల్ లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ లు ఇప్పటి వరకు ఎనిమిది చేశామని డాక్టర్. అబ్దుల్ సమ్మద్ తెలిపారు.ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు కు చెందిన అస్లాం (25) కిడ్నీ సమస్యతో భాదపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో అస్లాం తండ్రి అజీమ్ కిడ్నీ దానం చేశాడు.
తండ్రి కోడుకుల బ్లెడ్ గ్రూపులు వేరు అయినా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని వైద్యులు తెలిపారు. బ్లెడ్ గ్రూపు వేరైనా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయవచ్చని ఇది ప్రజలు గమనించాలన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్. సిద్దార్థ్ ,డాక్టర్. ఆబ్దుల్ సమ్మద్, డాక్టర్. రేష్మ, డాక్టర్. విజయసాయి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




